రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు

Apr 26 2026 2:09 AM | Updated on Apr 26 2026 2:09 AM

ఖిల్లాఘనపురం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోసం గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శనివారం డీసీసీ ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డితో కలిసి మండలంలోని తిర్మలాయపల్లి, కమాలోద్దీన్‌పూర్‌, అంతాయపల్లి, ఆగారం, ఖిల్లాఘనపురం, సల్కెలాపురం, సూర్యతండా, అల్లమాయపల్లి, రోడ్డుమీది తండా, షాపురం, మానాజీపేట, దొంతికుంట తండా, సోళీపురం, రుక్కన్నపల్లి, ఉప్పరిపల్లి, సూరాయిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కొత్తపల్లిలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు మండల కేంద్రంలో హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కేంద్రాల్లో విక్రయించడంతో మద్దతు ధర రూ.2,389 లభిస్తుందని.. అదేవిధంగా సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌ అందుతుందని వివరించారు. అవసరమైన ప్రతి గ్రామంలో సింగిల్‌విండో, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సుగుణ, ఎంపీఓ నర్సింహయ్య, ఏపీఎం నాగరాజు, సింగిల్‌విండో సీఈఓ కృష్ణ, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ఖిల్లాఘనపురం సర్పంచ్‌ ఆగారం పద్మమ్మ, నాయకులు మురళీధర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, కృష్ణయ్య యాదవ్‌, ఆగారం ప్రకాష్‌, గంజాయి రమేష్‌, క్యామ రాజు, డా. నరేందర్‌గౌడ్‌, బాలకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, మాసయ్యగౌడ్‌, నవీన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, రవినాయక్‌, శ్రీరాములు, దేవిజానాయక్‌, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement