గ్రీన్‌ జ్యూస్‌ రకాలు.. ఉపయోగాలు | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ జ్యూస్‌ రకాలు.. ఉపయోగాలు

Apr 26 2026 2:09 AM | Updated on Apr 26 2026 2:09 AM

● ఎనిమిది రోజుల వయస్సు గల గోధుమగడ్డి జ్యూస్‌తో రక్తం పెరిగి.. బీపీ నియంత్రణ, చర్మవ్యాధులు తగ్గుతాయి.

● బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ వల్ల గ్యాస్‌, అల్సర్‌ సమస్య, బరువు తగ్గడం, హార్ట్‌ బ్లాక్‌ సమస్య పరిష్కారంతోపాటు గర్భాశయ సమస్యల చెక్‌ పెడుతుంది. అధిక ఫైబర్‌ ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపరుస్తోంది.

● కొత్తిమీర, పుదీన, తులసీ జ్యూస్‌తో గర్భసంచి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

● సోరకాయ జ్యూస్‌ చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి, బరువును అదుపులో ఉంచుతుంది.

● కాకరకాయ జ్యూస్‌ షుగర్‌ను నియంత్రణలో ఉంచటంతోపాటు మల బద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది.

● కీర దోసకాయ జ్యూస్‌ గుండెజబ్బులు రాకుండా ఉపయోగపడుతుంది. శరీరంలోని వేడిని తగ్గించేందుకు పనిచేస్తుంది.

● దొండకాయ జ్యూస్‌ లివర్‌ సంబంధిత సమస్యను తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతుంది.

● క్యారెట్‌, బీట్‌రూట్‌ జ్యూస్‌ను రక్తం తక్కువగా ఉన్నవారు ఎక్కువగా తాగాలి. షుగర్‌ వ్యాధి ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగకూడదు.

మునగాకు జ్యూస్‌

మిక్సిడ్‌ వెజిటేబుల్‌ జ్యూస్‌ శరీరంలో సత్తువ తగ్గిన వారికి ఒంట్లో బలం పెంచేందుకు, ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.

రణపాల జ్యూస్‌ కిడ్నీలో రాళ్లు కరిగించడం, చర్మ వ్యాధులను తగ్గించడం, దీర్ఘకాలిక గాయాలను తగ్గించడానికి దోహదపడుతుంది.

మునగాకు జ్యూస్‌లో అధిక పోషకాలు ఉండటం వల్ల రక్తహీనత తగ్గటం, జీర్ణక్రియ మెరుగుపడటం, చర్మం, జుట్టు సమస్యలను పరిష్కరించడం, షుగర్‌ వ్యాధిని నియంత్రిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement