రైతులు దేశానికి వెన్నెముక అంటారు. కానీ.. ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రతి విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పంట వేసిన నాటి నుంచి విక్రయించేంత వరకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మకానికి తీసుకొస్తే కప్పడానికి టార్పాలిన్లు లేక వర్షం ఎప్పుడొస్తుందోనని భయంగా ఉంటుంది. ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు పంపిణీ చేస్తే బాగుంటుంది.
– మండ్ల శాంతమూర్తి, రైతు, అజ్జకొల్లు
అద్దెకు తెచ్చుకుంటున్నాం..
కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి వర్షానికి తడవకుండా ఉంచేందుకు టార్పాలిన్లు అద్దెకు తెచ్చుకుంటున్నాం. గతంలో ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్తు విక్రయించగా.. ప్రస్తుతం నిలిపివేసింది. అద్దెకు తీసుకురావడంతో అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు విక్రయించాలి. – రాజు, రైతు, కొత్తకోట
●


