వనపర్తి రూరల్: ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా మండలంలోని పెద్దగూడెం గ్రామంలో కొనసాగుతున్న ఓటరు మ్యాపింగ్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపాలన అధికారులు ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి అర్హులైన వారికి ఆర్థిక సాయం అందేలా చూడాలని తహసీల్దార్ రమేష్‌రెడ్డి, సంబంధిత అధికారులను కోరారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను కూడా త్వరగా పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణలో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్సరెన్స్‌లో జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్‌ఐలు, గ్రామపాలన అధికారులతో సమీక్షించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్


