మల్దకల్: స్వయంభూ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శేషదాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం దాసులవారి ఉత్సవమూర్తులను రథంపై ఉంచి భాజాభజంత్రీలతో ఊరేగించారు. అంతకు ముందు అభిషేకాలు, హోమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, శశాంక, ప్రసన్నచారిలు భక్తులకు ప్రవచనాలు వినిపించారు. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు బ్రాహ్మణులు, భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మహిళా భజన మండలి సభ్యులతో ప్రత్యేక భజనలు కొనసాగాయి. భక్తులకు దాసుల వారి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, శేషదాసుల వారి వంశస్థులు ధీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, విష్ణుదాసు, శశాంకదాసు, మధుసూదనాచారి, వెంకటేశ్వరావు, అరవిందరావు, శ్రీకాంత్‌జోషి, శేషగిరిరావు, గిరిరావు, చంద్రశేఖర్‌రావు, ముకుందరావు, బాబురావు, శ్రీకాంత్‌జోషి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.


