పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

–8లో u

మ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. వనపర్తి నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ శాఖ చేపట్టాల్సిన రోడ్ల పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ, మెడికల్‌ ఆస్పత్రి, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వినోద్‌కుమార్‌, ఎన్‌.ఖీమ్యానాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, వైస్‌చైర్మన్‌ మధుసూదన్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కౌన్సిలర్‌ ధనలక్ష్మి తదితరులు ఉన్నారు.

వనపర్తి: ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని దిశ కమిటీ చైర్మన్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన తోపాటు కో–చైర్మన్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు పీఎం సూర్య ఘర్‌ పథకంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పశుసంవర్ధకశాఖ పరిధిలో జీవాలకు సకాలంలో రోగనిరోధక టీకాలు వేసి రైతులకు సహకరించాలన్నారు. హౌసింగ్‌శాఖకు సంబంధించి జిల్లాకు మొత్తం 6,203 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో కేవలం 4,864 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయని, మిగతా 1,340 ఇళ్లను వేగంగా గ్రౌండింగ్‌ చేసి నిర్మాణాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఆర్థిక కారణాలతో ఇళ్ల నిర్మాణం చేసుకోలేని వారికి స్వయం సహాయక బృందాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ పెండింగ్‌ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి రూ.13 కోట్లతో మొత్తం 199 సీసీరోడ్లు మంజూరయ్యాయని.. వీటిలో ఇంకా 25 నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని త్వరగా పూర్తిచేయాలన్నారు. అదే విధంగా ప్రజలకు ఎల్‌పీజీ గ్యాస్‌ పొందడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పౌర సరఫరాల అధికారికి సూచించారు.

ఉపాధి కల్పనకు ప్రాధాన్యం..

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ మల్లు రవి సూచించారు. ప్రతి బ్యాంకు పరిధిలో ఎన్‌ఎస్‌ఎంఈ, ముద్ర, పీఎం విశ్వకర్మ పథకాల పరంగా లబ్ధిదారులకు వేగంగా రుణాలను మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బ్యాంకర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటిని వేగంగా పరిష్కరించాలన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో సిటీ స్కాన్‌ సెంటర్‌ ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను కూడా సామాజిక బాధ్యతగా నిర్మించడం జరిగిందన్నారు. అదే విధంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు 500 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌

వందశాతం పూర్తిచేయాలి

ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు రానివ్వొద్దు

నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చూడాల్సిన బాద్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామం కూడా పంచాయతీ భవనం లేకుండా ఉండొద్దని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు, పంట మార్పిడి విధానంపై రైతు లకు అవగాహన కల్పించాలన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు పథకాల లబ్ధిని చేకూర్చాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు రావాల్సి ఉంటే కలెక్టర్‌ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్మిక శాఖకు సంబంధించి శ్రమ యోగి మాంధన్‌ యోజన పథకంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లాలోని 21 పీఎంశ్రీ పాఠశాలల్లో పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement