బాబోయ్‌.. భౌభౌలు | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. భౌభౌలు

Apr 23 2026 8:42 AM | Updated on Apr 23 2026 8:42 AM

నమోదైన కేసులు..

జిల్లా వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం..

అధిక ఉష్ణోగ్రతలతో..

వనపర్తి
జిల్లాలో మూడు నెలల్లో 350 మందిపై కుక్కల దాడులు

గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

వనపర్తి: జిల్లావ్యాప్తంగా కుక్కల దాడులు క్రమంగా పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు నెలల వ్యవధిలోనే 350 మందిపై కుక్కలు దాడి చేశాయంటేనే పరిస్థితి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కల సంతతిని తగ్గించేందుకు రూ.50 లక్షల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ కొద్ది రోజులుగా మూసే ఉంచారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసినా.. స్థానిక మున్సిపల్‌ అధికారులు మాత్రం నిర్లక్ష్యం ధోరణి వీడటం లేదు. కనీసం నియంత్రణ చర్యలపై కూడా దృష్టి సారించకపోవడం శోచనీయం.

ఐదు మున్సిపాలిటీల్లో..

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ పరిధిలోనే సుమారు 2,600 పైచిలుకు కుక్కలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా. ఇక గ్రామాలతో కలిపితే వాటి సంఖ్య రెండింతల కంటే ఎక్కువే ఉంటుంది. చిన్నారులు క్రీడా మైదానంలో ఆడుకునేందుకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా సమీకృత కలెక్టరేట్‌లోనూ కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా.. పట్టించుకులే వారు లేకుండా పోయారనే నిట్టూర్పులు నిత్యం వినిపిస్తుంటాయి. కుక్కలు గుంపులుగుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులు, ద్విచక్రవాహనాలపై వారిని వెంబడిస్తున్నా యి. రాత్రిపూట రోడ్లపై వాహనదారుల వెంటపడుతూ భయపెడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, ఆత్మకూరు, పెబ్బేరు, అమరచింత మున్సిపాలిటీల్లో కుక్కల నియంత్రణకు నామమాత్రలు చర్యలతో సరిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

వ్యర్థ ఆహార పదార్థాలు, మాంసం వల్లే..

జిల్లాలోని ప్రధాన పట్టణాలు వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు ప్రాంతాల్లో హోటళ్లు, చికెన్‌, మటన్‌ షాపుల్లో వదిలేసే వ్యర్థాల కోసం కుక్కలు అక్కడే గుంపులుగా ఉంటూ.. రోడ్లపై సంచరించే వారిపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టం వచ్చినట్లు వ్యర్థాలను రోడ్డు పక్కనే వేయడంతో మాంసానికి అలవాటు పడిన కుక్కలు.. మాంసం లభించనప్పుడు పందులు, మేకలు, గొర్రెలు, మనుషులపై దాడి చేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బ యటికి వెళ్లాలన్నా భయపడాల్సిన దుస్థితి ఉందని ప్ర జలు వాపోతున్నారు. కుక్కల దాడి నుంచి తప్పించుకునే సమయంలో ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి.

సుల్తానాబాద్‌ ఘటనపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

అధికారుల్లో కనిపించని చలనం

మనుగడలో లేని ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌

రూ.50 లక్షల నిధులు వెచ్చించినా ఫలితం లేదు

జిల్లావ్యాప్తంగా మున్సిపల్‌, పంచాయతీ అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 3 వేల వరకు కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 450 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మరికొన్ని కుక్కలకు సైతం ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెంటర్‌ మూతపడి ఉన్న కారణంగా ఖచ్చితమైన లెక్కలు అందుబాటులో లేవని మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

కుక్కలు 2024లో 824 మందిపై, 2025లో 1,137 మందిపై దాడిచేయగా చికిత్స అందించారు. 2026 మార్చి చివరి వరకు 351 మందిపై కుక్కలు దాడి చేసి గాయపర్చాయి.

పది రోజుల నుంచి నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్‌ కలిగి దాడులు చేస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. అవి ఆగ్రహంతో ఉన్న సమయంలో ఎవరైనా ఎదురుగా కనిపిస్తే వారిపై దాడి చేస్తు న్నాయి. సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకక ఇలా వ్యవహరిస్తుంటాయని వైద్యులు తెలిపారు. ప్రధానంగా పిల్లలపై అధికంగా దాడులు చేసే అవకాశం ఉంటుందంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement