కొత్తకోట రూరల్: ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్న రకం వరి ధాన్యానికి బోనస్ అందించి అన్నదాతలకు అండగా నిలుస్తోందని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. పెద్దమందడి మండల కేంద్రంతో పాటు వెల్టూరులో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎంపీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే, కాంటా చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులకు వారం రోజుల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ
వెల్టూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న పలువురు లబ్ధిదారులకు ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేశారు. ఇల్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్‌కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఆర్‌డీఓ ఉమాదేవి, డీసీఎస్‌ఓ కాశీవిశ్వనాధ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో పీఎంశ్రీ పథకం కింద రూ 13.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సైన్స్ ల్యాబ్‌ను బుధవారం ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్‌సురభి ప్రారంభించారు. అనంతరం చిట్యాలలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, గ్రామ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ, సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, ఆర్సీఓ శ్రీనివాస్‌గౌడ్, డీసీఓ శ్రీవేణి, ప్రిన్సిపాల్ ప్రశాంతి, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, సర్పంచులు జి శోభ, సాలమ్మ, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి


