గద్వాల: గద్వాల కోట 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. గద్వాల సంస్థానం 17వ శతాబ్దం (1663– 1670)లో నల్లసోమనాద్రి (పెద్ద సోమభూపాలుడు) పూడూరు కేంద్రంగా గద్వాల కోట నిర్మించారు. కర్ణాటక సరిహద్దులోని రాయచూరు, రాయలసీమలోని నందికొట్కూరు వరకు పాలన చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోట నిర్మాణం మొత్తం మట్టితో నిర్మించడం ప్రత్యేకత. దీని లోపల అద్భుతమైన శిల్పకళతో కూడిన చెన్నకేశవస్వామి ఆలయం, ఆలయం ఎదుట 90 అడుగుల గాలిగోపురం నిర్మించారు. కృష్ణానది, తుంగభద్ర నదుల మ ధ్య గద్వాలలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మి ంచిన కోట చుట్టూ భారీ ప్రహరీ నిర్మాణం ఉంది. ఈ కోట వలయాకారంలో నిర్మించగా.. లోపలి వైపు రాతి తో కూడిన గోడ కట్టారు. కోటలోపల కందకం, బావి నిర్మాణాలు ఉన్నాయి. ఈ కోటలో ప్రముఖ నటుడు చిరంజీవి కొండవీటిరాజా సినిమాను నిర్మించారు.


