రాజసానికి చిహ్నం | - | Sakshi
Sakshi News home page

రాజసానికి చిహ్నం

Apr 19 2026 8:29 AM | Updated on Apr 19 2026 8:29 AM

సురభి వంశీయుల అడ్డా కొల్లాపూర్‌

శాంతి చిహ్నం.. వనపర్తి సంస్థానం

కొల్లాపూర్‌: జటప్రోల్‌ను సంస్థానంగా చేసుకొని కొల్లాపూర్‌ ప్రాంతాన్ని ప్రజారంజకంగా సురభి రాజులు పాలించారు. సురభిరాజుల పాలనకు సంబంధించి 14వ శతాబ్దం నుంచి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆనె గొంది రాజుల నుంచి జటప్రోల్‌ సంస్థానాన్ని సురభి రాజవంశస్థుడు మల్లనాయుడు కానుకగా పొందినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి సురభి రాజులు ఏకచత్రాధిపత్యంగా కొల్లాపూర్‌ను పాలించారు. సురభి సంస్థానం పరిధిలో 81 గ్రామాలు ఉండేవి. మొదట్లో జటప్రోల్‌లో సంస్థాన కోట నిర్మించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముస్లిం రాజులు తరుచూ దాడులకు దిగుతుండటంతో 1840లో సంస్థానం పరిపాలనను కొల్లాపూర్‌కు మార్చారు. ఇక్కడే రాజాబంగ్లాను నిర్మించగా.. 1884లో ప్రారంభించారు. మంత్రమహల్‌, చంద్రమహల్‌, రాణిమహల్‌గా బంగ్లాలోని భవనాలకు నామకరణం చేశారు. రాజ కుటుంబీకులు ఉద్యాన విహారం చేసేందుకు ఎల్లూరు సమీపంలోని పెద్దతోటలో బంగ్లా కట్టించారు. కొల్లాపూర్‌లోని రాజాబంగ్లాతో పాటు తోటబంగ్లా కూడా పర్యాటకులను కనువిందు చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement