డీలిమిటేషన్‌ను మహిళా బిల్లుతో లింక్‌ పెట్టడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌ను మహిళా బిల్లుతో లింక్‌ పెట్టడం సరికాదు

Apr 19 2026 8:29 AM | Updated on Apr 19 2026 8:29 AM

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: డీలిమిటేషన్‌ బిల్లును మహిళా బిల్లుతో లింక్‌పెట్టడం సరికాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో బిల్లు వీగిపోవడం నియంతృత్వ ధోరణితో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. 46 ఏళ్ల బీజేపీ ఒక్క మహిళను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా చేయలేదని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. ఇప్పుడున్న 543 సీట్లలో ఇది వరకు ఆమోదం పొందిన మహిళా బిల్లు ప్రకారం రిజర్వేషన్‌లు వచ్చే ఎన్నికల్లో అమలయ్యేలా బిల్లు పెడితే బేషరుతుగా మద్దతు ఇస్తామని, మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సబ్‌ కోటా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి స్టాండ్‌ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌–ఇండియా విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చి ఇక్కడి ప్రజలను అవమానపరిచారని, దీనిని సహించేది లేదన్నారు. ఆ ఎంపీ తెలంగాణ పట్ల మాట్లాడిన మాటలను పార్లమెంట్‌ రికార్డులో తొలగించే బాధ్యత ఇక్కడి బీజేపీ ఎంపీలపై ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, డాక్టర్‌ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement