డబ్బులు అడుగుతున్నారు.. | - | Sakshi
Sakshi News home page

డబ్బులు అడుగుతున్నారు..

Apr 19 2026 8:29 AM | Updated on Apr 19 2026 8:29 AM

డబ్బులు అడుగుతున్నారు.. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. ఫిర్యాదు చేయాలి..

నాకు మూడు ట్రిప్పుల ఇసుక అవసరం ఉంది. మీ–సేవా కేంద్రంలో ఈ నెల 2న బుక్‌ చేసుకుంటే బుధవారం వచ్చిన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లు రూ.500 అదనంగా ఇవ్వలేదని పంచాయితీ పెట్టుకున్నారు. ఒకరు మొత్తం ఇసుక పోసిపోగా.. మరొకరు కొంత ఇసుకను తిరిగి తీసుకెళ్లారు. గురువారం ఒకతను ఫోన్‌చేసి ట్రిప్పు ఇసుక వస్తుంది.. రూ.500 ఇస్తావా అని డిమాండ్‌ చేస్తున్నారు. ఇస్తానన్నా తీసుకురాలేదు.

– గాజులపేట నాగయ్య,

అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం

ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్న వారు ట్రాక్టర్ల వారికి తిరిగి డబ్బులు ఇవ్వరాదు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే ట్రాక్టర్‌ నంబర్‌, బుక్‌ చేసుకున్న ఐడీ ఇస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

– సుగుణ, తహసీల్దార్‌, ఖిల్లాఘనపురం

ఖిల్లాఘనపురం మండలం అంతాయపల్లి శివారులో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేశాం. ఇసుక అవసరమైన వారు మీ–సేవా కేంద్రాల్లో చూపిన ప్రకారం డబ్బులు చెల్లించాలి. ట్రాక్టర్ల వారు అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తే వెంటనే ఫిర్యాదు ఇస్తే ట్రాక్టర్‌ను ఇసుర తరలించకుండా రద్దు చేస్తాం. ఎవరికి కూడా అదనంగా డబ్బులు ఇవ్వకూడదు.

– సుబ్రమణ్యం, ఆర్డీఓ, వనపర్తి

Advertisement
 
Advertisement
Advertisement