
పాఠశాలల్లో విక్రయిస్తే చర్యలు..
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్టులు విక్రయిస్తే తనిఖీలు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇలాంటి స్టేషనరీ వ్యాపారాలు చేయొద్దని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఉత్తర్వులు కూడా జారీ చేశాం. బుధవారం పక్కా సమాచారంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించి పాఠ్య, రాత పుస్తకాలు, సామగ్రిని సీజ్ చేశాం.
– అబ్ధుల్ ఘని, జిల్లా విద్యాధికారి
●