విద్యుత్‌శాఖలో విజిలెన్స్ విచారణ
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఈ నెల 22న సీనియర్ అకౌంటెంట్ వెంకటరమణ, ఇతర ఉద్యోగుల విధులకు ఓ కాంట్రాక్టర్ ఆటంకం కలిగించారని, తప్పుడు బిల్లులు చేయనందుకు అమానుషంగా మాట్లాడుతున్నారని విద్యుత్ అధికారులు సీఎండీ ముషారఫ్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్ అధికారి, ఏపీటీఎస్ మహేశ్వర్‌రావు నేతృత్వంలో విజిలెన్స్ ఎస్‌ఈ మదన్ తదితరులు విచారణ చేపట్టారు. గొడవకు దారితీసిన పరిణామాలు, కాంట్రాక్టర్ వ్యవహరించిన తీరు తదితర వివరాలను ఉద్యోగులు, సిబ్బంది సుమారు 40 మందిని అడిగి తెలుసుకొని నమోదు చేసుకున్నారు. పలువురు అధికారులు జరిగిన ఘటన వీడియోలను విజిలెన్స్ అధికారులకు చూపించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి మహేశ్వర్‌రావు మాట్లాడుతూ.. అధికారులతో పాటు కాంట్రాక్టర్‌ను కూడా విచారిస్తామని, పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు వెంకటరమణ, వెంకటేష్, దయానందం, సత్యం, వరదరాజు, రవికుమార్, ప్రవీణ్, కేవీ శ్రీనివాసులు, నవీన్‌గౌడ్, హుస్సేన్, బాలప్రతాప్, శ్రీకాంత్, వెంకటేశ్వర్‌రెడ్డి, శాంతికుమారి, సునీత, రాధిక, దివ్య, మస్తాన్, జగదీశ్వర్, నిస్సీ తదితరులు పాల్గొన్నారు.


