
ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీరంగాపూర్, పెబ్బేర్, వీపనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించినట్లు చెప్పారు. మొత్తం 6,012 మంది విద్యార్థులకుగాను 5,860 మంది హాజరైనట్లు వివరించారు.
రామన్‌పాడులో
1,016 అడుగులు
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 39 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 112 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
బకాయి వేతనాలు
చెల్లించాలంటూ ధర్నా
వనపర్తి రూరల్: పెండింగ్ వేతనాలతో పాటు ఫీఎప్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ చట్టాలు అమలు చేయాలంటూ గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ముందుగా మర్రికుంట నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అరుణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతినెల వేతనాలు తీసుకోవడానికి డబ్బులుంటాయిగాని దళిత, బీసీ, మైనార్టీ, బహుజనులైన గ్రామపంచాయతీ కార్మికులకు ఇవ్వడానికి నెలకు రూ.60 కోట్లు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో సుమారు 60 వేల మంది కార్మికులు ఉన్నారని.. 2 నుంచి 7 నెలల వరకు బకాయి వేతనాలు చెల్లించాల్సి ఉందని వారంతా ఎలా బతకాలన్నారు. తక్షణమే కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డీఎల్‌పీఓకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బయ్య, ఘట ్టమ్మ, రామచంద్రయ్య, కురుమయ్య, ఖరీం, గంగమ్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటికే భద్రాచలం
సీతారాముల తలంబ్రాలు
వనపర్తి టౌన్: ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ డిపోలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి విడుదల చేశారు. అ నంతరం మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితు లు, అనారోగ్యం, దూరభారం తదితర కార ణాలతో భద్రాచలం వెళ్లలేని వారికి కార్గో ద్వారా తలంబ్రాలు ఇంటికి చేర్చుతామన్నా రు. కావాల్సిన భక్తులు సమీప ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో రూ.151 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌ఫోన్ నంబర్లు 98663 44200, 88018 28143, 88868 48518, 73828 29494 సంప్రదించాలన్నారు.
నేడు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది ప్రైవేట్ కంపెనీల్లో 935 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 99485 68830, 95502 05227, 91753 05435 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.

ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరు