టీడీపీని వీడిన 50 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరిన మొఖాస కొత్తవలస గ్రామస్తులు కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య
గజపతినగరం రూరల్(జామి):
గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని జామి మండలం మొఖాస కొత్తవలస గ్రామంలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామాని కి చెందిన 50 కుటుంబాలు ఒకేసారి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. దీంతో ఆ గ్రామంలో దాదాపు టీడీపీ ఖాళీ అయినట్లే. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గొర్లె రవికుమార్, పార్టీ సీనియర్ నాయకుడు పాండ్రంకి సంజీవి ఆధ్వర్యంలో ఆ 50 కుటుంబాల వారు ఆదివారం విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌లో గల మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య క్యాంప్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమం.. ఓ పండగ వాతావరణంలో.. అప్పుడే ఎన్నికలు వచ్చాయా అన్న రీతిలో జరిగింది. ఈ సందర్భంగా బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ అధికార టీడీపీ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆ మోసాలను భరించలేకనే తమ పార్టీలో ఒక్కొక్కరుగా చేరుతున్నారని అన్నారు.
టీడీపీ నమ్మక ద్రోహం వల్లే..
ఎన్నికల్లో గెలిపిస్తే, ఆరు నెలల్లో భీమసింగి సుగర్స్ ను తెరిపిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ తీరా అధికా రంలోకి వచ్చాక కర్మాగారాన్ని అమ్మేయాలని నిర్ణయించడం నమ్మకద్రోహమే అని, అందువల్లే ఆ పార్టీని వీడుతున్నట్లు మోకాస కొత్తవలస గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, టీడీపీ మండల నాయకుల నిరంకుశ పోకడల కారణంగా పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నామ ని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకం, స్థానికంగా బొత్స కుటుంబంపై విశ్వాసంతోనే పార్టీలో చేరుతున్నామని చెప్పుకొచ్చారు. పార్టీలో చేరిన వారిలో బండారు మురళి, బండారు అరప్ప, బండారు నా యుడు, కశిరెడ్డి అప్పలనరసయ్య, కశిరెడ్డి గౌరినా యుడు, కోటాన శ్రీను, కశిరెడ్డి కృష్ణ, పోలిపర్తి శ్రీకాంత్, కర్రోతు సీతంనాయుడు, గార చిన్న, సారి క అబద్ధం, జంపన్న రాజు తదితర కుటుంబాల పెద్దలు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గొర్లె రవికుమార్, పార్టీ సీనియర్ నాయకుడు పాండ్రంకి సంజీవరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.


