వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు ఈ ఏడాది జలకళ లేదు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి ఇన్‌ఫ్లోస్ రాకపోవడంతో ప్రాజెక్టు అడుగంటుతోంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులోకి 10వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. 64.60 మీటర్ల లెవెల్ నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన 3 టీఎంసీల నీరు నిలువ ఉండేది. అప్పట్లో మిగులు నీరు గేట్లు ద్వారా దిగువకు విడిచిపెట్టే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది ప్రాజెక్టు వద్ద 600 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి చేరుతోంది. 61.90 మీటర్లు నీటిమట్టం నమోదైంది. 1.10 టీఎంసీల నీరు నిలువ ఉంది. దీంతో ఆయకట్టు పరిధిలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఓ జూనియ ర్ కళాశాలలో సెకెండ్ ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని గర్భం దాల్చింది. వేసవి సెలవుల అనంతరం కళాశాలకు వచ్చిన విద్యార్థిని రుతుక్రమం అవుతుందంటూ ప్రతి నెలా రిజిస్టర్‌లో అడగకుండానే సంతకాలు పెట్టేస్తుండడంతో అనుమానంతో కళాశాల సిబ్బంది పరీక్ష చేయించగా నాలుగు నెలల గర్భవతిగా నిర్ధారణ అయింది. ఈ సమాచారాన్ని కళాశాల ప్రిన్సి పాల్ తమ ఉన్నతాధికారులకు, బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. అంతేకాకుండా బాలిక కు టీసీ ఇచ్చి ఆమె తల్లిదండ్రులతో ఇంటికి పంపేశారు. ఈ విషయమై ఎల్విన్ పేట ఎస్సై బి.శివప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలియజేశారు.
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యల ను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూ పేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరి యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధి త అధికారులకు అందజేయవచ్చన్నారు.
క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్
పీజీఆర్‌ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను కూడా తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చన్నారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా పీజీఆర్‌ఎస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.


