సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీని మూసేస్తే పోరాటమే | - | Sakshi
Sakshi News home page

సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీని మూసేస్తే పోరాటమే

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

సంకిలి సుగర్‌ ఫ్యాక్టరీని మూసేస్తే పోరాటమే ● ఎమ్మెల్సీ విక్రాంత్‌ హెచ్చరిక

రేగిడి: మండలంలోని సంకిలిలో గల ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం మూసివేస్తే చెరకు రైతుల తరఫు న పోరాటం చేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రేగిడిలో జరిగిన ఓ పైవేట్‌ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి అటు చెరకు రైతులు, ఇటు వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు జీవనం సాగిస్తున్నారని గుర్తుచేశారు. క్రషింగ్‌కు సరిపడా చెరకు లేదని చెప్పి ఫ్యాక్టరీ మూతవేస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. రైతులకు సరైన ప్రోత్సాహకాలు ఇవ్వక, తగిన మద్దతుధర లేక చెరకు సాగు తగ్గిందని, ఫ్యాక్టరీకి సరిపడా చెరకు పంట మాత్రం సాగులో ఉందని గుర్తుచేశారు. చెరకు పంట తప్ప వేరే పంటకు ఆస్కారం లేని వేలాది ఎకరాలు విజయనగరం, పార్వతీపురం మ న్యం జిల్లాల్లో ఉన్నాయని, రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తమిళనాడులో ఇస్తున్న మాదిరిగా మద్దతు ధరలు, ప్రోత్సాహకాలు ఇస్తే సాగు గణనీయంగా పెరుగుతుందన్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన కూటమి ప్రభుత్వం ఏమీ పట్ట నట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఫ్యాక్ట రీ మూసివేతకు యాజమాన్యం నోటీసులు ఇస్తే కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణ మన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు చేయాల ని, ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులతో మాట్లాడి, చెరకు సాగు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇవేమీ లేకుండా ఫ్యాక్టరీ క్రషింగ్‌ బంద్‌ చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. కార్యక్రమంలో చెరకు సాగు చేస్తున్న రైతులు కరణం శ్రీనివాసరావు, కింజరాపు సురేష్‌, కె. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement