ఆ మాస్ట్టారు మాకొద్దు... | - | Sakshi
Sakshi News home page

ఆ మాస్ట్టారు మాకొద్దు...

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

కొత్తవలస: తరచూ మా శరీర ఆకృతులు వర్ణిస్తారు.. చూడరాని బొమ్మలను చూపుతూ వేధింపులకు గురిచేస్తారు.. ఆ మాస్టారు మళ్లీ స్కూల్‌కు వస్తే మేమంతా బడిమానేయడం తప్ప మారో మార్గం లేదంటూ కొత్తవలస మండలం వీరభద్రపురం ప్రాథమిక్నోన్నత పాఠశాల బాలికలు గురువారం పాఠశాల ఆవరణలో ఆందోళన చేశారు. ఆ ఉపాధ్యాయుడిని మళ్లీ మా బడికి పంపించవద్దంటూ అధికారులను లిఖితపూర్వకంగా వేడుకున్నారు. రిజిస్టర్‌ పోస్టులో డీఈఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు కాపీ పంపించారు. వీరభద్రపురం ప్రాథమికోన్నత పాఠశాలలో గతంలో శాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన జె.వి.సన్యాసిరావు 6,7,8 తరగతుల బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తంచడం, కంప్యూటర్‌ ప్యానల్‌ బోర్డులో అసభ్యకరమైన బొమ్మలను చూపడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో డిప్యూటీ ఈఓ విచారణలో నిరూపణ కావడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను జామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు తాత్కాలికంగా బదిలీచేశారు. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరం చివరిరోజు కావడంతో గురువారం వీరభద్రపురం పాఠశాలకు వచ్చి ఆయన రిపోర్టుచేశారు. ఆయనను చూసిన బాలికలు హడలిపోయారు. మళ్లీ ఆ ఉపాధ్యాయుడిని ఇక్కడకు పంపిస్తే పాఠశాలకు మానేయడం తప్ప మరోమార్గం లేదంటూ వాపోయారు. ఆయనను ఇక్కడకు పంపించవద్దంటూ అధికారులను వేడుకున్నారు.

ఆయన బడికి వస్తే మానేస్తాం..

వీరభద్రపురం యూపీ స్కూల్‌ బాలికల ఆందోళన

డీఈఓ, కలెక్టర్లకు రిజిస్టర్‌ పోస్టులో ఫిర్యాదు

Advertisement
 
Advertisement
Advertisement