పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు నిర్దేశిత లక్ష్యాలు చేరకుని ఏ–గ్రేడ్ సాధించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. డిసెంబర్–2025కు సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఎల్‌ఎస్) ప్రగతిపై శాఖల వారీగా సమీక్షించారు. పనితీరులో వెనుకబడిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం జిల్లాలో 31 శాఖలు ‘సి’ గ్రేడ్‌లో ఉండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కేవలం 27 శాఖలు మాత్రమే ‘ఏ’ గ్రేడ్ సాధించగా, మరో 20 శాఖలు ‘బి’ గ్రేడ్‌లో ఉన్నాయని తెలిపారు. పోలీస్, హౌసింగ్, ఉద్యానవన శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని గ్రేడింగ్ పెంచుకోవాలని ఆదేశించారు. జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)లో 70 శాతం వాటా కలిగిన 53 కీలక ఆర్థిక సూచీలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి సారించాలని, వీటి ఆధారంగానే జిల్లా అభివృద్ధి స్థాయిని అంచనా వేస్తారని కలెక్టర్ గుర్తుచేశారు. పీఎం పోషణ్, ఉపాధి హామీ పథకాలలో సాధించిన ప్రగతిని కొనసాగించాలని సూచించారు. డేటా ఎంట్రీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. వీసీలో సీపీఓ పి.బాలాజీ, మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి బాలాలయం, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడిలో కొలువైన పైడితల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. పూజాకార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.
ఎ–గ్రేడ్ సాధించాల్సిందే
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
1/1
పుష్పాలంకరణలో పైడితల్లి