గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కొత్తవలస: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గల పట్టాలపై గుర్తు తెలియని మృతేహాన్ని స్థానికులు మంగళవారం కనుగొన్నారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస్ ప్రసాద్ సిబ్బందితో ఘటనా స్థలాన్ని సందర్శించారు.మృతేహాన్ని పరిశీలించగా మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడని ఆయన తెలిపారు. అలాగే మృతుడి శరీరంపై లేత నీలరంగు రౌండ్ నెక్ టీషర్టు, ముదురు నీలరంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. అలాగే ఎడమ చేతి దండపై కె.దేముడు అని తెలుగులో పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని విజయనగరం రైల్వే ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9247585742 నంబర్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు.


