● పరుగులు పెట్టించిన వృద్ధుడు
అనంతగిరి మండలం కటిక గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కోనూరు రామన్నకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆయన కుటుంబీకులు ఈ నెల 8వ తేదీన ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. వైద్యులు వృద్ధునికి వైద్య సేవలందిస్తున్నారు. ఆయన వద్ద కుటుంబీకులు ఎవరూ లేకపోవడం, అనాథగా విడిచిపెట్టడంతో మంగళవారం ఉదయం ఇంటిబాట పట్టాడు. ఆస్పత్రి వైద్యులకు కనిపించకుండా పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కాలిన గాయాలతో వెళ్లిపోతున్న వృద్ధుడిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఆస్పత్రిలో చేరాలని బ్రతిమలాడారు. తిరిగి ఆస్పత్రిలో చేర్పించేందుకు ఆపసోపాలు పడ్డారు. చివరకు మోసుకుని ఆస్పత్రిలో చేర్చారు. వృద్ధుడిని ఇలా అనాథగా వదిలేసి వెళ్లిపోయిన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలంటూ అక్కడివారు గుసగుసలాడారు. – శృంగవరపుకోట


