
ముద్దాయికి ఆరు నెలల జైలుశిక్ష
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలో జరిగిన దొంగతనాల కేసులో చీపురుపల్లి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు సివిల్‌జడ్జి వై.ప్రేమలత ముద్దాయికి ఆరునెలల జైలుశిక్ష విదిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. గరివిడి పోలీస్‌స్టేషన్ పరిధిలో గల దుమ్మెద, వెదుళ్లవలస,కొండలక్ష్మీపురం గ్రామాల్లో 2019లో దొంగతనాలు జరిగాయి. ఈ సంఘటనలపై అప్పుడే కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో బుదవారం కోర్టులో విచారణ జరపగా నేరం రుజువు కావడంతో ముద్దాయి పున్నాన రాంబాబుకు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వివరించారు.
హుషారుగా ఏనుగుల గుంపు
భామిని: మండలంలోని బిల్లుమడ సమీపంలో గల జీడితోటల్లో బుదవారం ఏనుగుల గుంపు హుషారుగా దర్శనమిచ్చింది. రెండు రోజుల క్రితం సింగిడికి చెందిన పింటూ సాంత్రో ఆరటిగెలను ఏనుగులకు అందివ్వబోయి కిందపడి రభస జరిగిన అనంతరం అటవీశాఖాధికారులు ఆందోళన చెందారు. పాలకొండ పారెస్ట్ రేంజర్ వచ్చి పరిస్థితి సమీక్షించి ఏనుగులను రెచ్చగొట్ట వద్దని ప్రజలకు చేసిన సూచనల మేరకు చూపరులు దూరమయ్యారు. ఈ క్రమంలో ఏనుగులు హుషారుగా యథావిధిగా తిరుగుతూ కనిపించాయి.