
జిల్లా జడ్జికి ఆత్మీయ వీడ్కోలు
విజయనగరం లీగల్: బదిలీపై గుంటూరు వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తికి జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘం ఆత్మీయ వీడ్కోలు పలికింది. స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన వీడ్కోలు సభలో పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపా యాల కల్పనకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృషిని కొనియాడారు. అనంతరం న్యాయమూర్తి దంపతులను గజమాలతో సత్కరించారు. సన్మాన గ్రహీత సాయికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ కేసుల పరిష్కారం, మెగా లోక్‌అదాలత్‌లు విజయవంతంగా నిర్వహించడంలో న్యాయవాదుల సహకారం ఎనలేనిదన్నారు. ఉత్తమ సేవలతోనే కీర్తిప్రతిష్టలు లభిస్తాయన్నారు. వీడ్కోలు సభలో న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిశెట్టి రవిబాబు, నలితం సురేష్ కుమార్, ఉపాధ్యక్షుడు పి.శివప్రసాద్, బి.సీతారామరాజు, కళ్లెంపూడి వెంకటరావు, బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ కోలగట్ల తమ్మన్నశెట్టి, సీనియర్ న్యాయవాదులు టి.వి.శ్రీనివాసరావు, బెల్లాన రవి, తదితరులు పాల్గొన్నారు.