
● రోడ్డెక్కిన ‘మురుగు’ సమస్య
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణలోపం వెరసి మురుగు సమస్య తరచూ రోడ్డెక్కుతోంది. దీనికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. నిత్యం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ కూడలి వద్ద ఉన్న మురుగు కాలువలో కొద్దిరోజులుగా పూడికలు తొలగించడం లేదు. పూడిక పేరుకుపోయి మురుగునీరు గురువారం రోడ్డుపై ప్రవహించింది. నగరవాసుల ఫిర్యాదుతో మేల్కొన్న కార్పొరేషన్ యంత్రాంగం పొక్లెయిన్‌తో కాలువలో పూడికల తొలగింపు పనులకు ఉపక్రమించింది. మురుగు రోడ్డెక్కితో తప్ప అధికారులకు బాధ్యత గుర్తు రాలేదంటూ స్థానికులు గుసగుసలాడారు. – విజయనగరం