ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ.. | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ..

Apr 5 2025 12:58 AM | Updated on Apr 5 2025 12:58 AM

● పార్కింగ్‌:

రామతీర్థంలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకల్లో స్వామివారి కల్యాణానికి గోటి తలంబ్రాలను ఉపయోగించనున్నారు. గడిచిన మూడు నెలలుగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో పలువురు భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. భద్రాచలంలో ఏటా జరుగుతున్న శ్రీరాముడి కల్యాణానికి వినియోగించినట్టే రామతీర్థంలో శ్రీరామడి కల్యాణానికి కూడా శ్రీకష్ణ చైతన్య సంఘం వారు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. కల్యాణం అనంతరం తలంబ్రాల సేవను అర్చకులు జరిపించనున్నారు

నెల్లిమర్ల రూరల్‌:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి కల్యాణశోభ సంతరించుకుంది. సీతారాముల కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తజనం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రామస్వామి వారి దేవస్థానం సమీపంలోని స్వామివారి కల్యాణ మండపంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సీతారామస్వామివారి పరిణయం వేడుకగా జరగనుంది. కల్యాణం నిర్వహించే వేదికను సుందరంగా అలంకరిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఐదు రోజుల నుంచే ఆలయానికి కల్యాణ శోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది రుత్వికులు స్వామివారి సన్నిధిలో పారాయణాలు, లక్ష తులసీ దళార్చన, కుంకుమార్చన తదితర కార్యక్రమాలను నిర్విరామంగా జరుపుతున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

స్వామివారి దర్శనం ఇలా...

రూ.50 టికెట్‌ తీసుకునే భక్తులకు తూర్పు రాజగోపురం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనం ఉత్తర రాజగోపురం ద్వారా అనుమతిస్తారు. సీతారామచంద్రస్వామి వారి కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు వివిధ రకాల సదుపాయాలను కల్పించారు.

ఎండ తీవ్రత దష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు

ఎండ తీవ్రత దష్ట్యా కల్యాణ ప్రాంగణంలో స్వామివారి కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, భక్తులు కూర్చునే వద్ద చల్లగా ఉండేందుకు ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చిన్న పిల్లలకు పాలు అందించనున్నారు. సతివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది.

విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి సుమారు 20 కిలోమీటర్ల ప్రయాణం చేసి రామతీర్థం చేరుకోవచ్చు. ఆటోల్లో వచ్చే వారు కోట జంక్షన్‌ నుంచి నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌కు చేరుకొని అక్కడ నుంచి 5 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రణస్థలం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి సతివాడ మీదుగా రామతీర్థానికి చేరుకోవచ్చు.

● ఆలయ ప్రాంగణం వద్ద, కళ్యాణ వేదిక ప్రారంభం వద్ద

● తలంబ్రాల కౌంటర్‌: స్వామివారి కళ్యాణ వేదిక వద్ద ఎడమ భాగాన

● ప్రాథమిక చికిత్సా కేంద్రం: కల్యాణ వేదిక ప్రాంగణంలో..

● ప్రసాదాల కౌంటర్‌: తూర్పు రాజగోపురం వద్ద

● స్నానపుగదులు: రామకోనేరు వద్ద (డార్మెటరీ భవనం పక్కన)

ఏర్పాట్లు జరుగుతున్నాయి

ఈ నెల 6న సీతారాముల కల్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సారి ప్రచా రాన్ని బాగానే నిర్వహించాం. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. భక్తులకు మంచినీరు, మజ్జిగ, చిన్న పిల్లలకు పాలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత ప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకున్నాం.

– వై.శ్రీనివాసరావు,

ఈఓ, రామతీర్థం దేవస్థానం

ఇలా చేరుకోవాలి:

సీతారాముల కల్యాణం చూతము రారండి

రాములోరి పెళ్లికి చురుగ్గా ఏర్పాట్లు

తిరుపతి నుంచి వచ్చిన పట్టువస్త్రాలు

ప్రత్యేక ఆకర్షణగా గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల సేవ

ముత్యాల తలంబ్రాల పంపిణీకి

ప్రత్యేక కౌంటర్లు

ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ.. 1
1/2

ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ..

ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ.. 2
2/2

ఆకట్టుకోనున్న గోటి తలంబ్రాల సేవ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement