నేటి నుంచి జేఈఈ మెయిన్స్ ఫేజ్ 2 పరీక్షలు
విజయనగరం అర్బన్: ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ ఐఐటీ కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ ఫేజ్–2 పరీక్షలు బుధవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా స్థానిక గాజులరేగ సమీపంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఐయాన్ డిజిటల్ జోన్ ఐడీజే భవనంలో జరగనున్నవి. జిల్లా నుంచి మొత్తం 4,239 మంది ఈ పరీక్ష రాయనున్నారు. తొలి రోజు ఉదయం 459 మంది, మధ్యాహ్నం పూట 441 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.
విజయనగరంతో
విడదీయలేని అనుబంధం
● పైడితల్లిని దర్శించుకున్న శైలజ దంపతులు
● అలరించిన స్వరసాగర సంగమం
● ఘనంగా గురునారాయణ కళాపీఠం నాలుగో వార్షికోత్సవం
విజయనగరం టౌన్: మహనీయులు నడయాడిన నేలపై తాము అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని, విజయనగరంతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని మధురగాయని, చలన చిత్రనటులు ఎస్.పి.శైలజ, శుభలేఖ సుధాకర్ దంపతులు పేర్కొన్నారు. స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన గురునారాయణ కళాపీఠం నాల్గొవ వార్షికోత్సవ వేడుకలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపకులు బి.ఎ.నారాయణ నేతృత్వంలో గాయనీ, గాయకులు పవన్ చరణ్, సంతోష్ కిరణ్, సురభిశ్రావణి, హారికా శివరామ్, ఆత్మీయ గాయని, సినీనటి పడాల కళ్యాణిలు సినీ, భక్తి గీతాలు అలపించి ఆహుతుల కరతాళధ్వనులందుకున్నారు. ఎస్‌పి శైలజ మయూరి చిత్రంలోని పాటను అలంపి శ్రోతలను అలరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ, గౌరవాధ్యక్షులు డోల మన్మథకుమార్, గౌరవ కార్యదర్శి నడిపేన శ్రీనివాసరావు, కోశాధికారి బి.పద్మావతి, యార్లగడ్డ బాబూరావు, గుడిశ శివకుమార్, ఉప్పుప్రకాష్, ఇమంది రామారావు, వైవీవీ సత్యనారాయణ, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
పైడితల్లిని దర్శించుకున్న శైలజ దంపతులు
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారిని ఎస్పీ శైలజ, సుధాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీ ప్రసాద్ నేతృత్వంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శైలజ దంపతులకు వేదాశీస్సులతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
నేటి నుంచి జేఈఈ మెయిన్స్ ఫేజ్ 2 పరీక్షలు


