యారాడ తీరంలో యూపీ యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

యారాడ తీరంలో యూపీ యువకుడి గల్లంతు

Aug 31 2026 12:08 AM | Updated on Aug 31 2026 12:08 AM

పెదగంట్యాడ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు యారాడ బీచ్‌లో గల్లంతయ్యాడు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన అవిరల్‌ సింగ్‌ తన తల్లిదండ్రులతో కలిసి మల్కాపురంలోని నౌసేనాబాగ్‌లో ఉంటున్న సోదరి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు రాకేష్‌కుమార్‌, దేవి, సాగర్‌, శైలేష్‌, అవిరల్‌ సింగ్‌, వీరేందర్‌ సింగ్‌ కలిసి సరదాగా గడిపేందుకు యారాడ తీరానికి వెళ్లారు. ఉదయం 7.30 గంటల సమయంలో సముద్ర స్నానానికి దిగారు. ఇంతలో పెద్ద కెరటం వచ్చి అవిరల్‌ సింగ్‌ను సముద్రంలోకి లాక్కెళ్లింది. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో బీచ్‌ లైఫ్‌గార్డులు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న నేవీ అధికారులు, న్యూపోర్టు పోలీసులు హెలికాప్టర్‌, డ్రోన్‌, బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడి తండ్రి వీరేందర్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు న్యూపోర్టు సీఐ టి.కామేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement