ఏఐ ద్వారా గుండె జబ్బుల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఏఐ ద్వారా గుండె జబ్బుల గుర్తింపు

Aug 31 2026 12:08 AM | Updated on Aug 31 2026 12:08 AM

మహారాణిపేట: ఆర్టిఫి

షియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఆధునిక కార్డియాక్‌ సీటీ సాంకేతికతలు గుండె వైద్యంలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయని ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు తెలిపారు.ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్స్‌, ఐఎంఏ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏఎంసీలో ఏఐ కార్డియాలజీ అంశంపై సీఏంఈ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ ఏఐ, ఆధునిక ఇమేజింగ్‌ ద్వారా గుండె జబ్బులను ముందుగానే గుర్తించి, సరైన సమయంలో చికిత్స అందించే అవకాశం పెరుగుతోందన్నారు. కార్డియాక్‌ సీటీతో కేవలం బ్లాకేజీల గుర్తింపే కాకుండా వాటి ప్రభావాన్ని కూడా అంచనా వేయవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఈ సాంకేతికతలు గుండె జబ్బుల నివారణ, చికిత్స ప్రణాళికలో కీలకంగా మారనున్నాయని చెప్పారు.కార్యక్రమంలో 400 మంది వైద్యులు, కార్డియాలజిస్టులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఐఎంఏ విశాఖ కార్యదర్శి డాక్టర్‌ మురళీమోహన్‌, పలువురు వైద్య నిపుణులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement