సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. ఆ లయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర పూజ నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. కాగా, సింహగిరికి చేరుకున్న వై.వి.సుబ్బారెడ్డికి ఆలయం వెలుపల వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్‌రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా పరిశీలకుడు శరగడం చిన్నఅప్పలనాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ తెడబారికి సురేష్‌కుమార్, నాయకులు కొండా రాజీవ్‌గాంధీ, రవి రెడ్డి, కట్టమూరి సతీష్, మంచా నాగమల్లేశ్వరి, కిరణ్‌రాజ్, అంబటి శైలేష్, బొండా ఉమా, పీలా ప్రేమ్, మనోజ్, భవానీ శంకర్, గారి ప్రసాద్, 98వ వార్డు నాయకుడు ఆదిరెడ్డి పాల్గొన్నారు.


