అల్లిపురం: ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 1వ ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్–గేమ్స్ మీట్–2026లో బాడీబిల్డింగ్ పోటీలకు విశాఖపట్నం పోర్టు అథారిటీకి చెందిన ఇద్దరు అనుభవజ్ఞులను జడ్జిలుగా నియమించనున్నారు. వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకు అమరావతిలోని వీఐటీ–ఏపీ యూనివర్సిటీలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల నిర్వహణలో సాంకేతిక పర్యవేక్షణ, నిర్ణయాలు, ఇతర ఏర్పాట్లలో సహకరించేందుకు అనుభవజ్ఞులైన ఇద్దరు జడ్జిలను నియమించాలని ఏపీ పోలీస్ స్పోర్ట్స్ విభాగం పోర్టు అథారిటీని కోరింది. పోర్టులో సీఎంఈ విభాగం నుంచి సి.హెచ్.చిన్నబాబు, కార్గో హ్యాండ్లింగ్ డివిజన్ నుంచి షిప్ క్రేన్ ఆపరేటర్ బి.గణపతిరెడ్డిలను పంపించాలని విజ్ఞప్తి చేసింది.


