శుభకార్యానికి వెళ్తుండగా.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్తుండగా.. అనంతలోకాలకు..

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

రోడ్డు ప్రమాదంలో వంట మాస్టర్‌ మృతి

ఆనందపురం: విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన గెడ్డపు ఈశ్వరరావు(32) శనివారం మధ్యాహ్నం గుడిలోవ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడలోని ఒక రెస్టారెంట్‌లో వంట మాస్టర్‌గా ఈశ్వరరావు పనిచేస్తున్నారు. తన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తుండగా.. ఎన్‌హెచ్‌–16పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తన ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్‌ను అకస్మాత్తుగా ఎడమ వైపునకు తిప్పడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతనికి భార్య, పాప, బాబు ఉన్నారు. సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం భీమిలి మార్చురీకి తరలించారు. ఈశ్వరరావు తల్లి గెడ్డపు సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ సి.హెచ్‌.వాసునాయుడు కేసు నమోదు చేయగా, ఎస్‌ఐ శివ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement