ఎప్పుడూ కళకళలాడే హార్బర్ నేడు వెలవెలబోతోంది. తూర్పు తీరంలో చేపల వేటపై ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి రావడంతో సముద్ర తీరం నిశ్శబ్దంగా మారిపోయింది. హార్బర్‌లోని జెట్టీకి దాదాపు 2,500 బోట్లు ఒకదాని పక్కన ఒకటి క్రమ పద్ధతిలోకట్టి ఉంచారు. గత 10 నెలలుగా సముద్రపు అలలతో పోరాడుతూ, అవిశ్రాంతంగా వేట సాగించిన మత్స్యకారులకు ఇప్పుడు ప్రభుత్వం విధించిన నిషేధంతో రెండు నెలల పాటు విరామం లభించింది. బోట్లకు రంగులు వేయడం, ఇంజిన్లు చెక్ చేయడం, చిరిగిపోయిన వలలను కుట్టడం వంటి పనుల్లో మత్స్యకారులు నిమగ్నమై ఉన్నారు. మళ్లీ జూన్ 15న వేట మొదలయ్యే నాటికి తమ నౌకలను సిద్ధం చేసే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. – మహారాణిపేట


