విద్య ముసుగులో ‘గీతం’ భారీ భూదోపిడీ
భూబదలాయింపు ముందే
అక్రమ నిర్మాణాలు
ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగ ప్రతినిధులు
ప్రభుత్వ భూమి షిఫ్ట్
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాలు బుధవారం కదం తొక్కాయి. భూబదలాయింపు ప్రక్రియ పూర్తి కాకుండానే జీవీఎంసీలో అక్రమంగా తీర్మానాలు చేశారని నాయకులు మండిపడ్డారు. రుషికొండలోని టీటీడీ ఆలయం నుంచి గీతం వరకు పాదయాత్ర నిర్వహించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు.. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కొమ్ముకాస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించాయి. విద్యాసంస్థలకు ప్రభుత్వ భూములు ఇస్తే నిబంధనల ప్రకారం పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం ఉచిత సీట్లు ఎందుకు ఇవ్వడం లేదని నేతలు సూటిగా ప్రశ్నించారు. ముఖ్యనేతలు గొలగాని హరి వెంకట కుమారి, కె.సతీష్, జియ్యాని శ్రీధర్, కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ, రొంగలి జగన్నాథం, సతీష్ వర్మ, పేడాడ రమణి కుమారి, పేర్ల విజయచందర్, అల్లు శంకరరావు, అనిల్‌కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, పోతిన హనుమంత్, తాడి జగనాధరెడ్డి, పల్లా దుర్గ, వి.ప్రసాద్, లింగం శ్రీను, రామిరెడ్డి, అల్లంపల్లి రాజబాబు, విద్యార్థి విభాగం నాయకులు హరీష్ వర్మ, బాణాల తరుణ్, గరికిన వెంకటేష్, జగ్గ శ్రవణ్ కుమార్, రెడ్డిపల్లి అవినాష్, పీలాక తరుణ్ రెడ్డి, చెన్న నితీష్, వాక తులసి కృష్ణ, లెంకా కార్తీక్, రౌతు శ్రీను, యువజన నాయకులు మహ్మద్ ఇమ్రాన్, దొడ్డి కిరణ్, కనకల ఈశ్వరరావు, రవికుమార్ రెడ్డి, ధీరజ్ కుమార్, జగ్గుపిల్ల నరేష్, పాల రమణ, ఎం. సంతోష్ కుమార్, తాడి రవితేజ, కాగితాల రవికిరణ్ పాల్గొన్నారు.


