డాబాగార్డెన్స్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అవకాశం గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న ఆస్తిపన్ను దారులు, గృహ యజమానులు వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే 2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీని ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ఏక మొత్తంలో చెల్లించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. జీవీఎంసీ సౌకర్యం కేంద్రంలో నగదు లేదా డీడీ లేదా చెక్కు, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా, జీవీఎంసీ వెబ్‌పోర్టల్ gvmc. gov. in& epaymeny& property tax/ vacant land tax& assessmeny number( new/ old)& email id& enter tax amount& pay now ద్వారా చెల్లించుకోవచ్చని తెలిపారు.


