పద్మనాభం: పద్మనాభం పంచాయతీ అర్చకునిపాలెంలో పాము కాటుకు గురై ఓ యువకుడు బుధవారం మృతి చెందినట్టు పద్మనాభం పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. అర్చకునిపాలెం గ్రామానికి చెందిన తాలాడ శివ(30) ఉదయం 8.30 గంటల సమయంలో చోడి పంటకు నీరు పెడుతుండగా పాము కాటేసింది. చికిత్స కోసం 108లో తీసుకు వెళ్లి విజయనగరం మహారాజా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. దీనిపై ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శివకు ఇంకా వివాహం కాలేదు. మృతుడికి తల్లిదండ్రులు ఉన్నారు.


