తగరపువలస: ఇంటర్ ఫలితాల్లో తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను ఎ.కార్తీక్, ఎస్.సాయిదీక్షిత, బి.జనని, జి.మనోహర్ 466 మార్కులు సాధించారు. 58 మంది 465 మార్కులు, 389 మంది 460 మార్కులు, 1603 మంది 400 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. బైపీసీలో పి.వర్షిత, పి.జితమన్యు, కె.నవ్యశ్రీ 451 మార్కులు సాధించగా 26 మంది 450 మార్కులు, 81 మంది 440 మార్కులు, 119 మంది 400 కంటే ఎక్కువ మార్కులు సాధించారన్నారు. సెకండియర్ ఫలితాల్లో ఎంపీసీలో జి.ప్రవళిక, పి.జయవర్ధిని, జి.రుత్విక్ 990 మార్కులు సాధించగా 287 మంది 980 కంటే ఎక్కువ, 1168 మంది 950 కంటే ఎక్కువ, 1660 మంది 900 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. బైపీసీలో బి.సాయిమేఘన, ఎం.నీలిమారాణి 990 సాధించగా 17 మంది 980 కంటే ఎక్కువ, 57 మంది 950 కంటే ఎక్కువ, 84 మంది 900 కంటే ఎక్కువ మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను రెసిడెంట్ డైరెక్టర్లు ఇ.మృత్యుంజయరావు, కె.ఎన్.వి.వి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, జి.సతీష్‌బాబు, అధ్యాపకులను తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు.


