అంబరాన్నంటిన సంబరాలు
సాక్షి, విశాఖపట్నం: మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియజేస్తూ మద్దిలపాలెంలో గల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయం బయట, లోపల మహిళా నేతలు ముగ్గులు వేశారు. భోగి మంటలు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, పిండివంటకాలు ప్రదర్శించారు. బసవన్నల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు అలరించాయి. సంప్రదాయాల పరిరక్షణలో మహిళల పాత్ర ప్రశంసనీయమని ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, పండగ ఆనందాలను పంచుకోవడం వైఎస్సార్ సీపీ సంస్కృతి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భోగిమంటల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సంబరాల్లో మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్‌ఈసీ సభ్యులు జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, పోతిన హనుమత్, రాష్ట పార్టీ సంయుక్త కార్యదర్శులు పీవీ నారాయణ, తాడి జగన్నాథ రెడ్డి, శ్రీనివాస్, నాగ మల్లేశ్వరి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, ద్రోణంరాజు శ్రీ వత్సవ, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు అంబటి శైలేష్, కటికల కల్పన, బోని శివరామకృష్ణ, కర్రి రామరెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, బర్కత్ అలీ, సేనాపతి అప్పారావు, బొండా ఉమామహేశ్వరరావు , దేవరకొండ మార్కెండేయులు, శ్రీదేవి వర్మ, సనపల రవీంద్ర, శకభక్తల ప్రసాద్, మాజీ చైర్మన్లు అలంపల్లి రాజబాబు, పళ్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు అనిల్ రాజు, అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, శశికళ, బిపిఎన్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
అంబరాన్నంటిన సంబరాలు


