సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి
మద్దిలపాలెం: మన సంస్కృతి, సంప్రదాయానికి సంక్రాంతి ప్రతీకగా నిలస్తుందని, యువత ఈ పండగ పరమార్థాన్ని గ్రహించాలని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న మహా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనఆయన మాట్లాడుతూ ప్రకృతితో మూడిపడిన పండగ సంక్రాంతి, నాలుగు రోజులు పండగలో నాలుగు విధాలైన పరమార్ధాలున్నాయన్నారు. వీటిని యువత తెలుసుకోవాలన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలను ఆత్మ నిర్భర్ సంక్రాంతిగా నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వు బ్యాంకు డైరెక్టర్ రాజేష్‌కుమార్ మహాన, ఎస్‌బీఐ డీజీఎం రాహుల్ సాంకృత్య, ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరుశురామరాజు పాల్గొన్నారు.
సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి
సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి


