ఆడపిల్లల్ని వేధిస్తే తాటతీస్తామన్న పవన్ ఎక్కడ ?
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల భద్రత అనేది కనుమరుగైపోయింది. మహిళలే లక్ష్యంగా దాడులు, దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరంలో జరుగుతున్న ఘటనలు మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మహిళల్ని ఎవరైనా వేధిస్తే అదే వారి చివరి రోజని చెప్పిన చంద్రబాబు.. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఏం చేస్తున్నారు.? ఆడపిల్లల్ని వేధిస్తే తాట తీస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏమైపోయారు? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాల శాతం పెరిగిపోయింది.
– వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ


