అంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోంది
మొన్న పెందుర్తి ఏకలవ్య కాలనీ పరిధిలో ఇద్దరు అమ్మాయిల్ని కొందరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మా సంఘ ప్రతినిధులు వారిని వెంటపడి పట్టుకున్నారు. కేసు నమోదు చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి బైండోవర్ నమోదు చేసి పంపించేశారు. మహిళల భద్రత విషయంలో భయపడాల్సి వస్తోంది. డ్రగ్ కల్చర్ నుంచి ప్రతి ఒక్కటీ ప్రభుత్వాల కనుసన్నల్లోనూ నడుస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం అన్ని చోట్లా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మహిళల్ని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తూ వారి హక్కుల్ని కాలరాస్తున్నారు.
– పి.లక్ష్మి, ప్రగతి శీల
మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు


