సింహాచంలో దర్శకుడు హరీష్ శంకర్
సింహాచలం : సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ సంప్రదాయం ప్రకారం ఏఈవో తిరుమలేశ్వరరావు స్వామివారి ప్రసాదం , శేషవస్త్రాన్ని బహూకరించారు.
కప్పస్తంభానికి మొక్కుకుంటున్న హరీష్‌శంకర్


