యూనియన్ బ్యాంక్ ఎన్‌ఆర్‌ఐ కార్నివాల్
మద్దిలపాలెం: ప్రవాసీ హమారా గౌరవ్ ప్రచారంలో భాగంగా గురువారం యూనియన్ బ్యాంక్ జోనల్, రీజనల్ కార్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో డాల్ఫిన్ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐ కార్నివాల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈడీ అమరీష్ ప్రసాద్, ఐబీడీ జీఎం సత్యజిత్ మహంతి, జీఎం డాక్టర్ హెచ్‌టీ వానప్ప, రీజనల్ హెడ్ జె.సింహాచలం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకు ప్రస్తుత, నూతన ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులతో వ్యక్తిగతంగా అనుసంధానం కావడానికి, వారి సహకారాన్ని గుర్తించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. బ్యాంకింగ్ సమస్యల పరిష్కారం, పెట్టుబడి ప్రయోజనాలు, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలపై ఖాతాదారుల ప్రశ్నలకు సమాధానలిచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.


