14న సింహగిరిపై సంక్రాంతి సంబరాలు
సింహాచలం: సింహగిరిపై ఈనెల 14న భోగి రోజున సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆ రోజు ఉదయం రాజగోపురం ఎదురుగా మాడవీధిలో పెద్ద ఎత్తున భోగి మంట వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గోపూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 13న సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఆ రోజు ఉదయం 9 గంటలకు చిన్నారులకు భోగిపళ్లు పోసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భఈనెల 16న కనుమ రోజు శ్రీకృష్ణాపురంలోని గోశాలలో ఉదయం 9గంటలకు గోపూజలు నిర్వహిస్తామన్నారు.
సింహగిరిపై రాజగోపురం


