స్టీల్‌ప్లాంట్‌ను ముంచేసిన ఘనుడు చంద్రబాబు
నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్‌ను ముంచేసిన ఘనుడు చంద్రబాబునాయుడేనని, ప్రైవేటు పరం కాకుండా కాపాడతానని బూటకపు హామీలిచ్చి మోసం చేశారని సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి సీహెచ్ నర్సింగరావు ధ్వజమెత్తారు. గత నెలలో పీడియాక్ట్ కింద అరైస్టె జైల్లో ఉన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు కుటుంబాన్ని బుధవారం పెనుగొల్లు ధర్మవరంలో పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అక్రమ భూసేకరణ, మత్స్యకారుల ప్రాణాలు తీసే బల్క్‌డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే కక్షతోనే అప్పలరాజుపై చంద్రబాబు ప్రభుత్వం పీడీయాక్ట్ పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించిందన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అపలేరని తెలిపారు. 2019లో ఓడిపోయాక తండ్రీకొడుకులు మూడేళ్లపాటు పత్తాలేకుండా పోయారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతాను, ప్రైవేటుపరంగా కానివ్వనని ఎన్నికల ముందు బూటకపు హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. తీరా గెలిచిన తర్వాత చేతులు ముడుచుకుని కూ ర్చొన్నారన్నారు. బీజేపీతో భాగస్వాములై కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు


