విత్తన బంతులతో సామాజిక వనాలు
విశాఖ సిటీ: విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరమని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్‌డీఏ, సిఫా, గ్రీన్ అంబాసిడర్స్, ఎస్‌ఆర్‌యూ–జీవీంఎంసీ, గ్రీన్ కై ్లమేట్ టీం ఎన్‌జీవోల నేతృత్వంలో 20 వేల విత్తన బంతులను కై లాసగిరిపై చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔషధ గుణాలున్న, పక్షులు గూళ్లు పెట్టుకునే, పక్షులకు ఇతర జీవులకు ఆహారాన్ని ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించాలని సూచించారు. మెట్రోపాలిటిన్ కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ దేశీయ ఆవు పేడ, ఒండ్రు మట్టి, ఔషధ గుణాలు కలిగిన, పక్షులు గూళ్లు పెట్టుకునే, వాటికి ఆహారాన్నిచ్చే చెట్ల విత్తనాలతో ఈ విత్తన బంతులు తయారు చేసినట్లు చెప్పారు. సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ సిరిమాను, అడ్డాకు, మర్రి, రావి, జువ్వి, నేరేడు, మారేడు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, దేవకాంచన, ఇండియన్ చెర్రీ, కుంకుడు, మామిడి, వేప, రేగు, సీమచింత, గుగ్గిలం, వెదురు, బిల్, చింత, పనస, ఇలా అనేక చెట్ల విత్తన బంతులు వినియోగించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీపీసీబీ రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.వి.ముకుందరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఎస్‌ఆర్‌యూ–జీవీఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ దాట్ల వివేక్ వర్మ, వీఎంఆర్‌డీఏ డీఎఫ్‌ఓ సుజాత శివాని, కై లాసగిరి హార్టీకల్చర్ ఆఫీసర్ రమేష్, గ్రీన్ కై ్లమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం, గ్రీన్ వాలంటీర్ ఐ.కృష్ణకుమారి, ఎస్‌ఆర్‌యూ–జీవీఎంసీ ప్రతినిధి మంగరాజు, గ్రీన్ అంబాసిడర్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


