ఆన్‌లైన్‌లో ఉత్తరద్వార దర్శనం టికెట్లు
సింహాచలం: ఈ నెల 30న జరిగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఉత్తరద్వార దర్శనం టికెట్లు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తాయని ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. భక్తులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www. ap temples.ap.gov.in వెబ్‌సైట్, 95523 00009 వాట్సాప్ నంబరు ద్వారా రూ.100, రూ.300, రూ.500 టికెట్లను బుక్ చేసుకోవాలి. వీరి దర్శనం ముగిసిన తర్వాతే కౌంటర్లలో టికెట్ల విక్రయం జరుపుతామన్నారు.
దర్శనవేళల్లో మార్పులు
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు ఈనెల 29 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు లభించవని, భక్తులంతా ఈవిషయాన్ని గమనించాలని సింహాచలం దేవస్థానం ఇచచార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసం పూజల్లో భాగంగా ఈ మార్పు చేసినట్టు తెలిపారు.


