జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు బలహీనవర్గాల అభ్యున్నతికి, మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూలే జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వంటి మహోన్నత వ్యక్తి సైతం పూలేను ఆదర్శంగా తీసుకున్నారన్నారు. అనంతరం బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కింద 50 శాతం బ్యాంకు రుణం, 50 శాతం ప్రభుత్వ రాయితీతో 400 యూనిట్లకు గాను రూ.10.45 కోట్ల విలువైన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ బ్యాంకుల అధికారులను కలెక్టర్ సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మధుసూదనరావు, రామ్మోహన్ నాయుడు, ఎ.కృష్ణ, ఎం.రవికుమార్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గొప్ప సామాజికవేత్త పూలే
మహారాణిపేట: గొప్ప సామాజిక వేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు అన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పూలే జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి ఎంపీ గొల్ల బాబూరావు పూలమా ల వేసి నివాళి అర్పించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, పేర్ల విజయ్ చంద్ర, పార్టీ ముఖ్య నాయకులు కొండా రాజీవ్‌గాంధీ, జహీర్ అహ్మద్, జిల్లా అధికార ప్రతినిధులు అహ్మద్, మొల్లి అప్పారావు, జిల్లా కమిటీ సభ్యులు మంచా మల్లేశ్వరి, పతివాడ కనకరాజు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, మారుతీ ప్రసాద్, కె.రాంరెడ్డి, సేనాపతి అప్పారావు, దేవరకొండ మార్కండేయులు, ఎండీ షరీఫ్, పార్టీ నాయకులు బొండా శీను, పత్తిపాడు వెంకటలక్ష్మి, సత్యవతి, భాను తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం


