
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
రూ.30 లక్షల మేర నష్టం
పెదగంట్యాడ: ఆటోనగర్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. న్యూపోర్టు పోలీసులు, పెదగంట్యాడ అగ్నిమాపకదళాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌లో ఎవర్‌గ్రీన్ పాలిమర్స్ పేరుతో ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమను ఎండీ ఇసాక్ నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఆయన పెదగంట్యాడ అగ్నిమాపక కేంద్రానికి, న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెదగంట్యాడ ఫైర్ సిబ్బందితో పాటు గంగవరం పోర్టు, హెచ్‌పీసీఎల్ నుంచి మొత్తం ఆరు ఫైరింజన్లను తీసుకువచ్చి మంటలను అదుపుచేసేయత్నం చేశారు. అయితే అప్పటికే పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించడంతో అందులోని ప్లాస్టిక్‌తో పాటు మిషనర్, రెండంతస్తుల భవనం దగ్ధమైంది. ప్రమాదంలో రూ.30లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని యజమాని ఇసాక్ తెలిపారు.