
సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు
మహారాణిపేట: పార్టీని బలోపేతం చేసే దిశగా అనుబంధ విభాగాల నిర్మాణం చేపట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ఆయా విభాగాల అధ్యక్షులకు సూచించారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అనుబంధ విభాగాల అధ్యక్షులు జిల్లా కమిటీని నియమించుకోవాలని, ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ప్రతీ నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీలో ప్రాతినిథ్యం వహించే విధంగా చర్యలు చేపట్టి.. ఆ వివరాలు అందజేయాలన్నారు. సమావేశంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు ఆడాల కృపా జ్యోతి(మహిళా విభాగం), బొండా ఉమా మహేష్ (ఐటీ విభాగం), నమ్మి లక్ష్మణ్‌రావు (విద్యార్థి విభాగం), మాన్యాల శ్రీనివాస్ (బీసీ విభాగం), బోని శివ రామకృష్ణ (ఎస్సీ విభాగం), పెండ్ర అప్పన్న (ఎస్టీ విభాగం), కె.వి.బాబా (మైనార్టీ విభాగం), కలిదండి బద్రినాథ్(వైఎస్సార్ ట్రేడ్ యానియన్), వానపల్లి ఈశ్వరరావు(వాణిజ్య విభాగం), వంకాయల మారుతీప్రసాద్ (వైఎస్సార్ సేవాదళ్), బయ్యవరపు రాధ (సాంస్కృతిక విభాగం), ఎ. రవిబాబు (క్రిస్టియన్ మైనార్టీ విభాగం), డా. వాక చంద్ర శేఖర్‌రెడ్డి (వైద్య విభాగం) తదితరులు పాల్గొన్నారు.
పార్టీ ఆయా విభాగాల జిల్లా అధ్యక్షులకు పంచకర్ల సూచన